Clash between House owner and tenents : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ఓనర్, అద్దెకు ఉండే వారికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆరు నెలల ఇంటి కిరాయి ఇవ్వాలని ఇంటి యాజమాని అయిన రఫాతుల్లా.. అద్దెకు ఉంటున్న నిహాల్‌ను అడిగాడు. అప్పుడు వారిద్దరి మధ్య మాటమాట పెరగడంతో అది కాస్త ఇరు కుటుంబాల మధ్య గొడవకు దారి తీసింది. దీనితో రాళ్లు, కర్రలతో ఇరువురు దాడి చేసుకున్నారు.
అద్దె విషయంలో గొడవ.. యజమాని, కిరాయిదారుల ఫైట్ - పాతబస్తీ తాజా వార్తలు
CC Footage: హైదరాబాద్ పాతబస్తీలోని టప్పాచబుత్ర పీఎస్ పరిధిలో ఇంటి అద్దె విషయంలో ఓ ఇంటి యాజమానికి, అద్దెకు ఉండే వారికి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇరువురి మధ్య మాట మాట పెరిగి ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
అద్దె విషయంలో గొడవ
ఈ ఘర్షణలో ఇరు వర్గాల వారికి గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరు వర్గాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో నమోదు అయ్యాయి.
ఇవీ చదవండి: