ముంచింగిపుట్టులో పౌరహక్కుల సంఘాల నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో పౌరహక్కుల సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాల్లో సీఎల్సీ మానవ హక్కుల వేదిక, చైతన్య మహిళా కమిటీ, ప్రజా కళా మండలి తదితర సంఘాల నాయకులు, కార్యకర్తల ఇళ్లలో సోదాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏతో అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
'పౌర హక్కుల సంఘాల నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి' - Vijayawada latest news
విజయవాడలో పౌరహక్కుల సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సోదాల పేరుతో కేంద్ర ప్రభుత్వం సంఘాల నాయకులపై ఎన్ఐఏతో అక్రమ కేసులు పెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.
విజయవాడలో పౌరహక్కుల సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం
ప్రజా సంఘాల నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ... వాటిని బేఖాతరు చేస్తూ సోదాలు నిర్వహించడాన్ని ఖండిస్తున్నామన్నారు.
ఇదీచదవండి.