కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వ వైద్యశాలలో కరోనాతో మృతి చెందిన ముగ్గురు బాధితులకు నగర పంచాయతీ కార్మికులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ వైద్యశాలలో నేడు నలుగురు మరణించగా.. అధికారుల ఆదేశాల మేరకు ముగ్గురికి స్థానిక నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు దహన సంస్కారాలు చేపట్టారు. కరోనా నిబంధనల ప్రకారం కార్మికులు పీపీఈ కిట్లు ధరించి.. స్థానిక మునేరు సమీపంలో అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశారు.
కరోనాతో ముగ్గురు మృతి.. పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు - కృష్ణా జిల్లా తాజా వార్తలు
కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందిన ముగ్గురు కొవిడ్ రోగులకు నగర పంచాయతీ కార్మికులు అంత్యక్రియలు నిర్వహించారు.
![కరోనాతో ముగ్గురు మృతి.. పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు covid death cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-vlcsnap-2021-05-04-16h13m13s108-0405newsroom-1620125039-657.jpg)
కొవిడ్ మృతులు