ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిమాండ్లు పరిష్కరించకపోతే.. సమ్మెకు దిగుతాం! - ఏపీలో మున్సిపల్ కార్మికుల సమస్యలు తాజా వార్తలు

మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని.. లేకపోతే వచ్చెనెలలో సమ్మె చేస్తామని హెచ్చరించారు.

citu
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

By

Published : May 21, 2021, 4:20 PM IST

మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. లేదంటే జూన్ 4వ తేదీ తరువాత ఏ రోజైనా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కరోనా రెెండవ దశ తీవ్రతతో ఇప్పటికే అనేకమంది మున్సిపల్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్స్, షూష్, పీపీఈ కిట్లు వంటివి అరకొరగా ఇచ్చి అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈఎస్ఐ, హెల్త్ అలవెన్సుతోపాటు జీతాల బకాయిలు ఇవ్వట్లేదని..దీంతో కార్మికుల కుటుంబాలు పస్తులతో గడపాల్సి వస్తుందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details