ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

26, 27న జరిగే సార్వత్రిక సమ్మెకు రైల్వే కార్మిక సంఘాల మద్దతు - ఈ నెల 26, 27న జరిగే సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాల మద్దతు

రైల్వేను ప్రైవేటీకరించడం అంటే దేశాన్ని ప్రైవేటీకరణ చేయడమేనని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. రైల్వే ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ నెల 26, 27 తేదీల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు రైల్వే కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని పేర్కొన్నారు.

citu protest against railway privatization
ఈ నెల 26, 27న జరిగే సార్వత్రిక సమ్మెకు రైల్వే కార్మిక సంఘాల మద్దతు

By

Published : Nov 23, 2020, 6:28 PM IST

రైల్వే ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. రైల్వేను ప్రైవేటీకరించడం అంటే దేశాన్ని ప్రైవేటీకరణ చేయడమే అని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. 'రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకించండి' అనే పుస్తకాన్ని సీఐటీయూ నేతలు విడుదల చేశారు.

సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రయాణ సౌధం రైల్వే అని రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలపై అధిక భారం పడుతుందని పేర్కొన్నారు. కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని... రైల్వేను ప్రైవేటీకరిస్తే సహించేది లేదన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెకు రైల్వే కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details