ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భిక్షాటన చేస్తూ మున్సిపల్​ కార్మికులు వినూత్న నిరసన'

నెలలు తరబడి వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న మున్సిపల్ శాఖ తీరును నిరసిస్తూ.. విజయవాడ వన్ టౌన్ నెహ్రూ కూడలి వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తూ మున్సిపల్​ కార్మికులు వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకుంటే ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని అధికారులను కార్మిక సంఘం నాయకుల హెచ్చరించారు. కాంట్రాక్టు కార్మికుల జీవితాలతో కార్పొరేషన్ అధికారులు ఆడుకుంటుందని వారు మండిపడ్డారు.

citu dharna on non payment of salary
మున్సిపల్​ కార్మికులు వినూత్న నిరసన ప్రదర్శన

By

Published : Dec 23, 2020, 6:26 PM IST

తమకు బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ.. విజయవాడ వన్ టౌన్ నెహ్రూ కూడలి వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తూ మున్సిపల్​ కార్మికులు వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు. నెలలు తరబడి తమకు వేతనాలు చెల్లించకుండా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్​డౌన్​ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసినా.. తమకి ఏడు నెలల వేతనం పెండింగ్‌లో పెట్టారని వారు వాపోయారు.

వైకాపా అధికారంలోకి రాగానే కాంట్రాక్టు మున్సిపల్ కార్మికులను క్రమబద్ధికరిస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు ఆ హామీని గాలికి వదిలేశారని సీఐటీయూ సంఘం నాయకులు మండిపడ్డారు. కాంట్రాక్టు కార్మికుల జీవితాలతో కార్పొరేషన్ అధికారులు ఆడుకుంటున్నారని అన్నారు. వెంటనే తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని అధికారులను కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details