కృష్ణా జిల్లా కైకలూరులో తెదేపా విజయాన్ని కాంక్షిస్తూ బుల్లితెర నటీనటులు భగవాన్ , శ్రావణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శాసనసభ అభ్యర్థి జయమంగళం వెంకటరమణ, పార్లమెంట్ అభ్యర్థి మాగంటి బాబులను గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. ప్రతి ఇంటికి వెళ్లి గత 5 ఏళ్లలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.
తెదేపా విజయాన్ని కాంక్షిస్తూ.. బుల్లితెర నటుల ప్రచారం
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా విజయాన్ని కాంక్షిస్తూ...కృష్ణా జిల్లా కైకలూరులో బుల్లితెర నటీనటులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు.
బుల్లితెరనటుల ప్రచారం