కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వ్యతిరేకతపై రైతన్న చిత్రాన్ని చిత్రీకరించినట్లు ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి తెలిపారు. ఈ సినిమాను చూడటానికి హైదరాబాద్కు రావాలని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావును ఆయన ఆహ్వానించారు. దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళన చేస్తున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతుల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు.
'మోదీ ప్రభుత్వం దేశాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తోంది' - cine actor narayana murthy latest news
నూతన వ్యవసాయ చట్టాల వ్యతిరేకతపై రైతన్న చిత్రాన్ని రూపొందించినట్లు ప్రముఖ నటుడు నారాయణమూర్తి తెలిపారు. ప్రైవేటు వ్యక్తులకు మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రముఖ నటుడు నారాయణమూర్తి