కృష్ణా జిల్లా విజయవాడలో ప్రముఖ హోటల్ వరుణ్ నోవాటెల్ హోటల్లో కేక్ మిక్సింగ్‌తో క్రిస్మస్ సంబరాలు ఘనంగా ప్రారంభించారు. ఎండు ఫలాలు, దేశీయ మద్యంతో పాటు విదేశాలకు చెందిన ఖరీదైన వైన్లతో కేక్ తయారీకి అవసరమైన మిక్సింగ్‌ని తయారు చేశారు. వరుణ్ గ్రూప్ హోటల్స్‌లో ఏటా క్రిస్మస్ వేడుకలను కేక్ మిక్సింగ్‌తో ప్రారంభిస్తున్నామని సంస్థ ఛైర్మన్ వల్లూరుపల్లి ప్రభు కిషోర్ తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా విజయవాడ నోవాటెల్ హోటల్లో వరుణ్ గ్రూప్‌నకు చెందిన ప్రముఖులు, అనాథ ఆశ్రమానికి చెందిన పిల్లలతో కేక్ మిక్సింగ్ చేయించారు. డిసెంబర్ రెండో వారం వరకు ఈ మిశ్రమాన్ని అప్పుడప్పుడూ కలియబెడుతూ చివరిగా కేకు తయారీ ప్రారంభిస్తామని చెఫ్ వినయ్ కుమార్ తెలిపారు.
క్రిస్మస్ సంబరం... కేక్ మిక్సింగ్‌తో ఆరంభం - Christmas cake mixing news in vijayawada
విజయవాడలో క్రిస్మస్ సంబరాలు మెుదలయ్యాయి. ప్రముఖ హోటల్ వరుణ్ నోవాటెల్ హోటల్లో కేక్ మిక్సింగ్‌తో క్రిస్మస్ సంబరాలు ఘనంగా ప్రారంభించారు.
Christmas cake mixing at Vijayawada Varun Novatel Hotel