ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా క్రైస్తవ సంఘాల ర్యాలీ - క్రైస్తవులతో చంద్రబాబు కామెంట్స్

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా క్రైస్తవ సంఘాల నేతల ఆధ్వర్యంలో మైలవరం బస్టాండ్ నుంచి క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు‌. క్రైస్తవుల పట్ల వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.

చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా క్రైస్తవ సంఘాలు ర్యాలీ
చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా క్రైస్తవ సంఘాలు ర్యాలీ

By

Published : Jan 22, 2021, 7:02 PM IST


తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై క్రైస్తవ సంఘాలు నిరసన వ్యక్తంచేశాయి. ఆయన మాటలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈమేరకు కృష్ణా జిల్లా మైలవరంలో క్రైస్తవ, దైవసంఘాల సేవకులు ర్యాలీ నిర్వహించారు‌. క్రైస్తవులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని లేదంటే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు

ABOUT THE AUTHOR

...view details