మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిర్లైన్స్ విమానం సాంకేతిక లోపం తలెత్తడం వల్ల పైలెట్ అప్రమత్తమయ్యారు. టేకాఫ్ అయిన అరగంటకే మళ్లీ విమానాన్ని వెనక్కు తిప్పి ముంబయి ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఫ్లైట్‌లో మొత్తం 120 మంది ప్రయాణికులున్నారు. పైలట్ వెంటనే సమస్యను గుర్తించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రయాణికులంతా విమానాశ్రాయంలోనే పడిగాపులు కాయగా.. తర్వాత మరో విమానం ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ పంపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది.
చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తోన్న విస్తారా ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతికలోపం తలెత్తి టేకాఫ్ అయిన అరగంటకే.. విమానాన్ని వెనక్కు తిప్పి ముంబయిలో దింపారు. విమానంలో సినీనటుడు చిరంజీవితోపాటు... 120 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం