ఒరిస్సా నుంచి బాలకార్మికులను తీసుకువచ్చి వెట్టిచాకిరీ చేయిస్తున్న ఇటుకబట్టీల యాజమాన్యంపై కార్మికశాఖ కమిషనర్ ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఒరిస్సానుంచి 35మంది బాలకార్మికులను తీసుకువచ్చి కంచికచర్ల మండలం గొట్టెముక్కల గ్రామంలో ఇటుకబట్టీల్లో పనులు చేయిస్తున్నారు. వారికి కనీస వేతనం ఇవ్వకపోవడంతోపాటు రాత్రింబవళ్లు పనిచేయించుకుంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న బాలకార్మికుడు పురుషోత్తమకుమార్ ఒరిస్సాలోని కార్మికశాఖ కార్యాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేశారు. అనంతరం ఒరిస్సా రాష్ట్ర అధికారులు ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ అధికారులకు సమాచారం అందించడంతో దాడులు నిర్వహించారు.
పని చేయించి... వేతనాలివ్వడం లేదు! - undefined
కృష్ణా జిల్లా గొట్టుముక్కల ప్రాంతంలో.. ఒడిశాకు చెందిన బాలకార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న వ్యవహారం బయటపడింది. పిల్లలతో బలవంతంగా పని చేయిస్తున్న ఇటుక బట్టీ నిర్వాహకుల నిర్వాకంపై.. కార్మిక శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.
పని చేయించి... వేతనాలివ్వడం లేదు!
కనీసం అనారోగ్యానికి గురైనా తమకు వైద్య సదుపాయం సైతం అందించకుండా...తమతో యాజమాన్యం పనిచేయించుకుంటోందని వారు ఆరోపించారు. కార్మికశాఖ కమిషనర్ ఆంజనేయరెడ్డితోపాటు ఒరిస్సా కార్మికశాఖ అధికారిణి భాగ్యశ్రీ నందిగామ సహాయ కమిషనర్ మహేశ్వరరెడ్డి ఇటుక బట్టీ యాజమాన్యంపై కేసులు నమోదుచేశారు. 35మంది బాలకార్మికులకు రవాణ ఖర్చును అందచేసి వారి స్వస్థలాలకు పంపించారు.
Last Updated : Apr 19, 2019, 7:23 AM IST
TAGGED:
child labour