తెలుగుదేశం పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్త చిరుమామిళ్ళ కృష్ణారావును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముందు నందిగామ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి... అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని సీఐడీ అధికారులు చిరుమామిళ్ళ కృష్ణారావుపై కేసు నమోదు చేశారు.
తెదేపా సోషల్ మీడియా కార్యకర్త చిరుమామిళ్ళ కృష్ణారావు అరెస్ట్ - తెదేపా సోషల్ మీడియా కార్యకర్త చిరుమామిళ్ళ కృష్ణారావు అరెస్ట్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నవారిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ కారణంతోనే తెలుగుదేశం పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్త చిరుమామిళ్ళ కృష్ణారావును అదుపులోకి తీసుకున్నారు.
chigurumamilla krishnarao
కొన్ని రోజుల కిందట సీఐడీ అధికారులు కృష్ణారావును అదుపులోకి తీసుకొని మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించి పంపించారు. ఇప్పుడు అరెస్ట్ చేయడంతో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కావాలనే ప్రతిపక్షంపై కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతుందని నందిగామ జడ్పీటీసీ అభ్యర్థి సజ్జ అజయ్ ఆరోపించారు. అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:తెదేపా సానుభూతిపరుడు నలంద కిషోర్ అరెస్ట్