ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రామ స్వరాజ్యం... సచివాలయాల ఏర్పాటుతో సాకారం' - grama sachivalaya's news

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో గ్రామ స్వరాజ్యం సాకారమైందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వీటిని ఏర్పాటు చేసి శుక్రవారం నాటికి ఏడాది పూర్తవటం అభినందనీయని చెప్పారు.

chief whip srikanth reddy
chief whip srikanth reddy

By

Published : Oct 1, 2020, 10:17 PM IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ విజయవంతమైందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సచివాలయాల ఏర్పాటుతో సాకారమైందని వ్యాఖ్యానించారు. శుక్రవారానికి గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు వీటి వల్ల ఉద్యోగాలు లభించాయని వెల్లడించారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రధాని మోదీ కూడా ప్రశంసించారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులు ఏవీ ప్రతిపక్షానికి కనిపించడం లేక ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ధైర్యముంటే తనపై ఉన్న కేసులపై స్టేలు ఎత్తివేయించుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు అన్ని బండారాలు బయటపడతాయన్నారు. ప్రభుత్వ పాలన నచ్చే తెదేపా ఎమ్మెల్యేలు వైకాపా వైపు వస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details