విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలలో గెలుపును వైకాపా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 15వ డివిజన్లో వైకాపా అభ్యర్థిని బెల్లం దుర్గతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్‌లు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ డివిజన్లో తెదేపాకి అభ్యర్థి లేకపోవడం... ఆ పార్టీ పతనానికి నాందీ అని వైకాపా నేత ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను అన్నారు.
విజయవాడలో ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను ప్రచారం... - విజయవాడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సామినేని ఉదయభాను
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారాన్ని వైకాపా ముమ్మరం చేసింది. 15 వ డివిజన్లో వైకాపా అభ్యర్థిని బెల్లం దుర్గతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సామినేని ఉధయబాను
ఇంటి పన్నులు పెంపు పై తెదేపా చేసేది దుష్ప్రచారంగా వైకాపా నేత దేవినేని అవినాష్ కొట్టిపారేశారు. పన్నుల పెంపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండి వారికి ప్రభుత్వం నుంచి కావలసిన సహాయ సహకారాలు అందించడంలో ముందుంటానని 15 డివిజన్ వైకాపా అభ్యర్థిని బెల్లం దుర్గ అన్నారు.
ఇదీ చదవండి: కౌలురైతు కుటుంబానికి రూ. 2.50లక్షల చెక్కు అందజేత