స్వర్ణా ప్యాలెస్ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రెండు విచారణ కమిటీలను వేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. హోటల్‌ను తాత్కాలిక ఆస్పత్రిగా మార్చి కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యుడు రమేష్ చౌదరి తెదేపా నేత అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నిర్వహించిన జూమ్ సమావేశాల్లోనూ రమేష్ పాల్గొన్నారనీ.. అప్పుడు కూడా అతడు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కరోనా రోగులను దృష్టిలో పెట్టుకొని వైద్యానికి ప్రభుత్వం అనుమతినిస్తే దాన్ని కొన్ని ఆస్పత్రులు దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు. పాలన బాగోలేదని విమర్శలు చేసే రమేష్ చౌదరి కరోనా రోగుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే 10 మంది చనిపోయారని ప్రాథమికంగా తేలిందనీ.. దీనిపై పూర్తిస్థాయి నివేదిక వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆ వైద్యుడు తెదేపా నేత: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి - chief whip gadikota fires on tdp news
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెదేపా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్ణా ప్యాలెస్ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని స్పష్టం చేశారు. కరోనా రోగులకు స్వర్ణా ప్యాలెస్‌ను కొవిడ్ ఆసుపత్రిగా మార్చి.. వైద్యం చేసింది తెదేపా నేత అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి
అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనీ విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. వైకాపా ప్రభుత్వానికి ఏ ప్రాంతంపైనా దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. కర్నూలులో న్యాయరాజధాని అవసరం లేదని చంద్రబాబు, పవన్‌లు రాయలసీమ ప్రజలకు చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వండి'.. రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ