HEALTH SECRETARY ANGRY: ‘ఏసీ లేకుండా మందులు నిల్వ చేస్తారా.. కొత్త ఏసీ ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉన్నారా?’ అంటూ డ్రగ్‌స్టోర్ అధికారులపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఏపీఎంఐడీసీ ఎండీ మురళీధరరెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వినోద్‌కుమార్‌లతో కలిసి కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న మందుల నిల్వలను పరిశీలించి వాటి వివరాలపై ఆరా తీశారు.
ఏసీ లేకుండా మందుల నిల్వలా? వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆగ్రహం - కృష్ణా జిల్లా తాజా వార్తలు
HEALTH SECRETARY ANGRY: ‘ఏసీ లేకుండా మందులు నిల్వ చేస్తారా.. కొత్త ఏసీ ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉన్నారా?’ అంటూ డ్రగ్‌స్టోర్ అధికారులపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలోని సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మందులు నిల్వ ఉన్న ఓ గదిలో ఏసీ లేకపోవడాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతులకు వీలు కాదన్నారని ఈఈ రవీంద్రబాబు చెప్పగా, రూ.కోట్ల విలువైన మందులున్న ప్రాంతంలో రూ.20వేలు పెట్టి ఏసీ ఏర్పాటు చేయించలేరా అంటూ కృష్ణబాబు ప్రశ్నించారు. వెంటనే ఏసీ ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. మందుల జాబితా ఆన్‌లైన్‌లో లేకపోవడాన్ని తప్పుబట్టారు. ‘మా వద్ద ఉన్న మందులు ఇవే.. కావాలంటే తీసుకోండి అని చెప్పదలచుకున్నారా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్ని రకాల మందులున్నాయని ప్రశ్నించగా 608 రకాలని డ్రగ్‌స్టోర్ జీఎం హరిప్రసాద్ చెప్పారు. మందులన్నింటినీ ఆస్పత్రి వైద్యులు ఇండెంట్ పెట్టుకునేలా ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. వివిధ ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంపై కృష్ణబాబు అసహనం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో నిర్మిస్తున్న వైద్యకళాశాలను ఎమ్మెల్యే పేర్ని నానితో కలిసి పరిశీలించారు.
ఇవీ చదవండి: