CM Review : వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. రబీలో ఈ– క్రాప్ బుకింగ్ పై సీఎం ఆరా తీశారు.48.02 లక్షల ఎకరాల్లో 97.5 శాతం ఈ–క్రాప్ బుకింగ్ పూర్తయిందని అధికారులు తెలిపారు. వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద జులై నాటికి 500 కిసాన్ డ్రోన్లు, డిసెంబర్ నాటికి 1500కు పైగా డ్రోన్లు ఇచ్చే దిశగా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
రైతు భరోసా నిధులు విడుదల చేయాలి.. ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలలో రైతు భరోసా నిధులు తొలి విడత ఇచ్చేందుకు సిద్ధం కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అర్హులైన రైతుల జాబితాలను మే 10వ తేదీ నాటికి అన్ని గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన అధికారులు.. 467 వీఏఏ, 1644 వీహెచ్‌ఏ, 23 వీఎస్‌ఏ, 64 వీఎఫ్‌ఏ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 4 వేల 656 ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజనల్లో రైతుల దగ్గరనుంచి సేకరించిన ధాన్యానికి దాదాపుగా చెల్లింపులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 7 వేల 233 కోట్లకు గానూ 7వేల 200 కోట్లు చెల్లించామని, ఖాతాల్లో సాంకేతిక పరమైన ఇబ్బందులు కారణంగా 33 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ డబ్బును వెంటనే చెల్లించాలని సీఎం ఆదేశించారు. రబీ ప్రొక్యూర్‌మెంట్‌కు అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామని అధికారులు తెలిపారు.