విజయవాడలోని స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా మూడు దశల్లో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్వరాజ్ మైదానం పేరును అంబేడ్కర్ స్వరాజ్ మైదానంగా మార్పు చేశారు.
స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన - vijayawada news today
విజయవాడలోని స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. స్వరాజ్ మైదానం పేరును అంబేడ్కర్ స్వరాజ్ మైదానంగా మార్చారు. విగ్రహాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన
అంబేడ్కర్ చేసిన పనులు ఎప్పటికీ గుర్తుండేలా పార్కును అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. 20 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్, ఆహ్లాదకరమైన పార్కు, గ్రంథాలయం, అధ్యయన కేంద్రం, ఓపెన్ థియేటర్ నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో ఇదీ ఒకటిగా నిలుస్తుందన్నారు. మంత్రులు విశ్వరూప్, వనిత, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీచదవండి.