ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నోముల అంత్యక్రియలు.. తెలంగాణ సీఎం హాజరు - nomula narsimhaiah last rites at palem

తెలంగాణలోని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. నోముల మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

nomula narsimhaiah funeral
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్

By

Published : Dec 3, 2020, 1:51 PM IST

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్

తెలంగాణలోని నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెంలోని స్మృతి స్థలంలో... నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు నిర్వహించారు. నోముల అంతిమ సంస్కారాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. నర్సింహయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెరాస శ్రేణులు పాల్గొన్నారు. అనారోగ్యంతో ఈనెల 1న నోముల నర్సింహయ్య హైదరాబాద్​లో కన్నుమూశారు.

ABOUT THE AUTHOR

...view details