ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan Review: 'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్​ను సమర్థంగా అమలు చేయాలి': సీఎం జగన్​ - కమ్యూనిటీ హెల్త్‌

CM Jagan's review of medical and health department : వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఒక ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని నిర్దేశించారు. ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గర మొదలుకుని ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని అదేశించారు. క్యూ ఆర్‌ కోడ్‌ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని సూచించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 13, 2023, 7:26 PM IST

CM Jagan's Review on Medical and Health: వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్​ రెడ్డి సమీక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదని నిర్దేశించారు.ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్‌ నంబర్‌ ప్రతిచోటా ఉంచాలని ఆదేశిస్తూ..దీనికోసం సమర్థవంతమైన ఎస్‌ఓపీలను పెట్టాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని, పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్​ల పనితీరు ఇందులో కీలకం అని అన్నారు. ప్రివెంటివ్‌ కేర్‌లో మనం ఆశించిన లక్ష్యాలను అప్పుడే సాధించగలమన్న సీఎం.. వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్‌ వ్యవస్థ సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు. ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని, 4 వారాలకు మించి ఎక్కడా సిబ్బంది కొరత ఉండకూడదని స్పష్టం చేశారు.

సరైన వైద్యం అందించాలి.. కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చినట్లు అధికారులు వివరించారు. ప్రథమ చికిత్స, పాము కాటు, ఐవీ ఇన్‌ఫ్యూజన్, ఇంజక్షన్, వూండ్‌ కేర్, డ్రస్సింగ్, బేసిక్‌ కార్డియాక్‌ లైఫ్‌ సపోర్ట్‌ లాంటి అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. అక్టోబరు 22న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్​ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 1,39,97,189 మందికి సేవలందించినట్లు వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా సేవలందుకున్న వారిలో 35,79,569 మంది హైపర్‌ టెన్షన్‌, 24,31,934 డయాబెటిస్‌తో బాధ పడతున్నట్టు గుర్తించినట్లు తెలపగా.. వారందరికీ మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలి.. పేషెంట్‌కు చికిత్స అందించడంతోపాటు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను ట్రాక్‌ చేయాలని అదేశించారు.విలేజ్‌ క్లినిక్‌ స్థాయిలో క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయాలన్నారు.సికిల్‌ సెల్‌ ఎనీమియాను నివారించే కార్యక్రమంపై సీఎం సమీక్షించగా.. ఈ ఏడాది 6.68 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెలలోనే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభిస్తున్నామని, ఓరల్‌ హెల్త్‌లో భాగంగా ప్రతినెలా దంత వైద్యులు పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో దంతసమస్యల చికిత్సకు అవసరమైన చర్యలు, టీబీ నివారణపైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వెల్లడించిన అధికారులు... ప్రస్తుతం లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. అందరికీ పరీక్షలు నిర్వహించాలని, బాధితులను గుర్తించి చికిత్స అందించే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

ప్రతి ఒక్కరికీ ఆరోగ్య శ్రీ కార్డు... ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గరనుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీకార్డు ఇవ్వాలని, క్యూ ఆర్‌ కోడ్‌ ఉన్న ఈ కార్డు ద్వారా ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభం కానున్న కొత్త మెడికల్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాలపైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. మెడికల్‌ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని చెప్తూ.. ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభమవుతున్నట్లు వెల్లడించారు. పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్‌ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎం వద్ద వివరించారు.

ABOUT THE AUTHOR

...view details