CM Jagan fire on Ministers : గుంటూరు జిల్లా అమరావతిలోని సచివాలయంలో సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మంత్రులతో కొద్దిసేపు ఇతర అంశాలపై మాట్లాడినట్లు సమాచారం. ఇటీవలి రాజకీయ పరిణామాలు, పార్టీలో అంతర్గత విభేదాలపై కొందరు మంత్రులకు క్లాస్ పీకినట్లు తెలిసింది.
మంత్రులకు సీఎం జగన్ క్లాస్.. అందుకేనా..! - ఏపీ ముఖ్యవార్తలు
CM Jagan fire on Ministers : ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రులకు క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. సచివాలయంలో కేబినెట్ సమావేశం అనంతరం సీఎం పలు అంశాలపై మంత్రులతో మాట్లాడారు.
కేబినెట్ సమావేశం
సినీ ప్రముఖులకు నివాళి :ఇటీవల మృతి చెందిన సినీ ప్రముఖులందరికీ ఏపీ కేబినెట్ నివాళులర్పించింది. తెలుగు సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం.బాలయ్య, కె. విశ్వనాథ్, వాణీజయరామ్, జమున, డైరెక్టర్ సాగర్‌కు కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రివర్గం నివాళి అర్పిస్తూ మౌనం పాటించింది. ఈ అంశాన్ని సమాచార సినిమాటోగ్రఫీ మంత్రి వేణుగోపాల్ ప్రతిపాదించారు.
ఇవీ చదవండి :