ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan directed ministers for Elections : పథకాల సంగతి నేను చూసుకుంటా.. ఎన్నికలకు సిద్ధం కండి : మంత్రులకు జగన్ ఆదేశం - general elections

CM Jagan directed ministers for Elections : మంత్రులంతా ఎన్నికల మోడ్‌లో సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి జగన్‌ దిశానిర్దేశం చేశారు. సొంత నియోజకవర్గంతోపాటు జిల్లా బాధ్యత కూడా మంత్రులదేనని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేస్తే, మిగతాది తాను చూసుకుంటానని చెప్పారు. జీపీఎస్‌కు ఆమోదం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో మేనిఫెస్టో 99.5 శాతం అమలు చేసినట్లయిందని కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌ అన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 8, 2023, 7:11 AM IST

CM Jagan directed ministers for Elections : రాష్ట్రంలో ఎన్నికలకు 9 నెలల సమయమే ఉన్నందున గడప గడపకు కార్యక్రమమే కాకుండా ఎన్నికల మోడ్‌లో వేగంగా పనిచేయాలని... మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధం కావాలని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేస్తూ నియోజకవర్గాలను పూర్తిగా చక్కదిద్దుకోవాలని... అలాగే జిల్లాల బాధ్యత మంత్రులదేనని అన్నారు. నియోజకవర్గాల్లో, జిల్లాలో ఏవైనా గ్యాప్‌లు ఉంటే ఇప్పటి నుంచి సరిదిద్దుకోవాలని మంత్రులకు చెప్పారు. ముందస్తు ఎన్నికలంటూ బయట బాగా చర్చ జరుగుతోందని కొందరు మంత్రులు ప్రస్తావించగా... 2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిందని, ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయని సీఎం గుర్తు చేశారు.

అందువల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని... గట్టిగా 9 నెలల సమయమే ఉందన్నారు. ఇది మనకు చాలా కీలకమైన సమయమన్న ఆయన... మిగతా చర్చలన్నీ పక్కనబెట్టి ఎన్నికలపై ఫోకస్‌ పెట్టాలని నిర్దేశించారు. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మంచిని మంత్రులు, ఎమ్మెల్యేలు జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని... ఇకపైన నిరంతరం ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. పథకాలను అమలుచేసే పనిని తాను చూసుకుంటున్నట్లు చెప్పిన సీఎం... మీ పని మీరు చేయండి అని మంత్రులకు చెప్పినట్లు సమాచారం.

తెలుగుదేశం ఇటీవల విడుదల చేసిన తొలి మేనిఫెస్టో గురించి కేబినెట్‌ భేటీలో ఒకరిద్దరు మంత్రులు లేవనెత్తగా... అదంతా కాపీ, పేస్ట్ మేనిఫెస్టో అని మరికొందరు అన్నట్లు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్‌ హామీల్లో విజయవంతమైన వాటిని, మన రాష్ట్రంలో అమ్మఒడి లాంటి సక్సెస్‌ఫుల్‌ పథకాలను కాపీ పేస్ట్‌ చేసుకుని తీసుకువచ్చిన మేనిఫెస్టో అని సీఎం అన్నట్లు తెలిసింది. చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోనవసరం లేదని.... మంత్రులు తమ పని తాము చేస్తే, నా పని నేను చేస్తా అని సీఎం అన్నట్లు సమాచారం. మంత్రులంతా కష్టపడి పనిచేస్తే మళ్లీ విజయం మనదేనని మంత్రులతో సీఎం అన్నట్లు తెలిసింది.

ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్తీసుకురావడం వల్ల ఎవరికీ నష్టమైతే జరగదని సీఎం అన్నారు. ఏమీలేని చోట జీపీఎస్‌ అమలుకు సిద్ధమైనట్లు చెప్పారు. రెండేళ్లుగా ఆలోచించి, కసరత్తు చేసి జీపీఎస్ పై నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మంచిగా ఆలోచిస్తే ఇది మంచిగా ఉంటుందని, ఇంకో రకంగా ఆలోచించేవారికి వాళ్ల ఆలోచనలను బట్టి ఉంటుందని అన్నట్లు సమాచారం. సీపీఎస్ స్థానంలో జీపీఎస్​కు ఆమోదం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపాక పలువురు మంత్రులు బల్లలు చరిచారు. ఈ నిర్ణయంతో మేనిఫెస్టోలోని హామీలను 99.5 శాతం అమలు చేసినట్లవుతుందని కొందరు మంత్రులు అనగా... అవునంటూ సీఎం నవ్వులు చిందించారు.

ABOUT THE AUTHOR

...view details