విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఐసోలేషన్ కేంద్రాలు, రెడ్‌జోన్ ప్రాంతాల్లో డ్రోన్ సహాయంతో పిచికారీకి నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంది. కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పర్యవేక్షణలో ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా పాజిటివ్ బాధితులకు వైద్యం అందిస్తోన్న ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల.. డ్రోన్ సహాయంతో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. నగరంలో నాలుగు పాజిటివ్ కేసులు వచ్చిన కారణంగా.. ఆయా బాధితుల నివాస ప్రాంతాల్లోనూ డ్రోన్‌తో పిచికారీకి చర్యలు తీసుకున్నారు.
డ్రోన్ సాయంతో ప్రభుత్వాసుపత్రి ఆవరణలో పిచికారి - live updates of corona virus in andhrapradesh
విజయవాడలో డ్రోన్ సహాయంతో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ఐసోలేషన్ కేంద్రాల్లో ఈ చర్యను అమలు చేశారు.
డ్రోన్ సాయంతో ప్రభుత్వాసుపత్రి ఆవరణలో పిచికారి
TAGGED:
latestn news of vijayawada