కృష్ణా జిల్లా దివిసీమలోకి అనుమతి లేకుండా వచ్చేవారిని పోలీసులు తిప్పిపంపుతున్నారు. అనుమతి లేకుండా దివిసీమ మండలాల్లోకి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలకు చేరుకునేందుకు ఉన్న రెండు మార్గాలైన మోపిదేవి వార్పు, పులిగడ్డ టోల్గేట్ వద్ద పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అనుమతి ఉన్నవారినే గ్రామాల్లోకి అనుమతిస్తున్నారు. ఉద్యోగులను సైతం ఐడెంటిటీ కార్డులు చూపిన తరువాతనే అనుమతిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఒక్క కరోనా కేసు నమోదు కాకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రజలు అభినందిస్తున్నారు.
దివిసీమ సరిహద్దు గ్రామాల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు - diviseema latest news
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కరోనా కేసులు నమోదు కాకుండా పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. బయట ప్రాంతాల ప్రజలెవ్వరూ దివిసీమలోకి రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.
దివిసీమ సరిహద్దు గ్రామాల్లో చెక్‌పోస్టులు