ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాటరీ పేరుతో లాగేస్తున్నారు.. జర జాగ్రత్త! - లాటరీ పేరుతో విజయవాడలో మోసాలు

మీకు కోటి రూపాయల లాటరీ తగిలింది..ఆ డబ్బు మీకు రావాలంటే ముందుగా కొంతమొత్తం మా ఖాతాలో వెయ్యాలంటూ ఫోన్లు. ఆశపడి డబ్బు వేస్తే.. అడ్డంగా బుక్కయినట్లే. ఇలాంటి ఘటనలు విజయవాడ, గుంటూరు నగరాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.

cheating in the name of lottey happend in vijayawda and guntur dst
cheating in the name of lottey happend in vijayawda and guntur dst

By

Published : Jul 20, 2020, 3:09 PM IST

విజయవాడకు చెందిన విజయ్‌ ఫోన్ కు ఓ నంబర్‌ నుంచి కాల్ వచ్చింది. మీకు రూ.రెండు కోట్లు లాటరీ తగిలిందని అవతలి వ్యక్తి చెప్పాడు. మీకు వేరే చరవాణి నుంచి ఫోన్‌ వస్తుంది. అప్పుడు ఈ నంబర్‌ తెలపండి అని చెప్పి పెట్టేశాడు. అసలు తాను లాటరీ టికెట్‌ కొనకపోయినా.. ఫోన్‌ చేసిన వ్యక్తి ఎవరో కూడా తెలియకపోయినా.. అదేదీ ఆలోచించకుండా విజయ్‌ ఎగిరి గంతేశాడు. కొద్ది రోజుల్లోనే కోటీశ్వరుడు అయిపోతానని కలలు కన్నాడు.

ఈ విషయంపై ఎవరితోనూ చర్చించలేదు. అంతలోనే అతనికి ఫోన్‌ వచ్చింది. లాటరీ సొమ్ము అందాలంటే ఫార్మాలిటీస్‌ కింద తాము సూచించిన బ్యాంకు ఖాతాలో కొంత రుసుం వేయాలనేది సారాంశం. అలా రూ.20 వేలతో ప్రారంభమైన చెల్లింపులు రూ.2 లక్షలు వరకు చేరాయి. చివరకు మోసపోయాయని గ్రహించిన విజయ్... లబోదిబోమంటూ పోలీసులకు ఆశ్రయించాడు. అతడి చేతికి ఒక్కపైసా సొమ్ము ఇప్పటివరకు తిరిగి అందలేదు.

కొన్ని నెలల కిందట గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన ఓ బ్యాంకు అధికారి ఇదే తరహాలో మోసపోయారు. అతను మెయిల్‌కు ఓ సందేశం వచ్చింది. ‘మీకు రూ.కోటి లాటరీ తగిలింది' అని దాని సారాంశం. దీనికి ఆశపడిన ఆయన వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.10వేలు వేశారు. తర్వాత మరో రూ.10వేలు జమచేశారు. ఆ తర్వాత మోసాన్ని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి సంఘటనలు విజయవాడ, గుంటూరు పరిధిలో తరచూ వెలుగుచూస్తున్నా.. మోసపోతున్న వారు పెరుగుతూనే ఉన్నారు.

ముమ్మాటికీ అత్యాశే..!:

తొలినాళ్లలో ఎక్కువగా నైజీరియన్‌ నేరగాళ్లే ఈ మోసాలకు పాల్పడేవారు. ప్రస్తుతం ఎల్లలు దాటి అన్ని రకాల వాళ్లు ఇందులో ఉన్నారు. విజయవాడలో తరచూ ఇలా లాటరీల పేరిట మోసాలకు వలేస్తున్నారు. బాధితుల అత్యాశే ఇందుకు కారణమని పోలీసులు విశ్లేషిస్తున్నారు. సెల్‌ఫోన్‌కో లేక మెయిల్‌కో లాటరీ గెలిచిన సందేశం వచ్చినట్లు మిత్రులతో బాధితులు పంచుకోకపోవటం వల్లే నైజీరియన్లు సులభంగా మోసం చేయగలుగుతున్నారు.

బాధితులు నిండా మునిగేవరకు విషయం బయటకు పొక్కడం లేదు. తాము పంపే సందేశాలకు తిరిగి సమాధానమిచ్చే వారిని అత్యాశపరులుగా గుర్తిస్తూ మోసగాళ్లు బుట్టలో వేస్తున్నారు. అనంతరం ‘టాక్స్‌ క్లియరెన్స్‌’, ‘యాంటీ టెర్రరిస్ట్‌ ఫండ్‌’, ‘ఆర్‌బీఐ టాక్స్‌ పేయింగ్‌’.. ఇలా ఏ పేరు మదిలో మెదిలితే ఆ పేర్లతో డబ్బులు దండుకుంటున్నారు.

చిక్కితే అంతే.!

రకరకాల పద్ధతుల్లో బాధితుల డబ్బును ఆన్‌లైన్‌ ద్వారా తాము సూచించిన బ్యాంకు ఖాతాల్లో/వ్యాలెట్లలో వేయించుకుంటున్న అక్రమార్కులు.. ఆ వెంటనే డబ్బును బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేసేస్తున్నారు. అలా కొల్లగొట్టిన సామ్ముతో దుస్తులు కొని ఓడల ద్వారా ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నారు. లేదా ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌, హవాలా మార్గాల్లో పంపించేస్తున్నారు.

ఒకవేళ పోలీసుల పరిశోధన జరిపి కంప్యూటర్‌ ఐపీ అడ్రస్‌ ఆధారంగా తమను పట్టుకున్నా, డబ్బు దొరక్కుండా ఈ తరహా జాగ్రత్తలు పాటిస్తున్నారు. తాము కేసుల పాలై జైలుకెళ్లినా గరిష్ఠంగా మూడు నెలల్లోనే బెయిల్‌పై బయటికి వచ్చే అవకాశముండటంతో తిరిగి నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో విజయవాడ పోలీసులు ఇద్దరు నైజీరియన్లు లాటరీ మోసాల కేసులో పట్టుకొచ్చినప్పుడు వారి వద్ద రూ.20వేలు మాత్రమే దొరికాయి. ఆరేళ్ల కాలంలో బాధితుల పోగొట్టుకున్న సొత్తు సుమారు రూ.5 కోట్ల వరకు ఉంది.

ఎవరూ ఊరికే ఏదీ ఇవ్వరు

ఊరికే ఎవరూ డబ్బులు ఇవ్వరు అనే విషయాన్ని అందరు గుర్తు పెట్టుకోవాలి. లాటరీలో డబ్బులు, కార్లు, బైక్‌లు వచ్చాయని ఎవరైనా చెబితే నమ్మొద్ధు ఇటువంటి వాటికి స్పందించవద్ధు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వొద్ధు ఒక్కసారి డబ్బులు పొగొట్టుకుంటే రావడం చాలా కష్టం. ఎవరైనా మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించండని సైబర్‌ ఇన్‌స్పెక్టర్‌ కోమాకులు శివాజీ తెలిపారు.

ఇదీ చూడండి:

కొవిడ్​ కేర్​ సెంటర్​లో బాధితుల ఫ్లాష్​ మాబ్​!

ABOUT THE AUTHOR

...view details