ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆహార భద్రత కార్డుల్లో భారీ మార్పుచేర్పులు.. ఉత్తరాంధ్ర, సీమలో అధికంగా! - Changes in NFSC Cards of ap

Changes in NFSC Cards: జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కార్డుల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున మార్పుచేర్పులు చేసింది. మొత్తం కార్డులు, లబ్ధిదారుల సంఖ్యను గతంలో మాదిరిగా కొనసాగిస్తూనే.. జిల్లాల పరిధిలో మార్పులు చేసింది.

Changes in NFSC Cards
Changes in NFSC Cards

By

Published : Jul 25, 2022, 4:06 AM IST

Changes in NFSC Cards: జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కార్డుల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున మార్పుచేర్పులు చేసింది. మొత్తం కార్డులు, లబ్ధిదారుల సంఖ్యను గతంలో మాదిరిగా కొనసాగిస్తూనే.. జిల్లాల పరిధిలో మార్పులు చేసింది. జులై వరకు ప్రతి జిల్లాలో సగటున 50 నుంచి 60% కార్డులు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలో ఉన్నాయి. ఆగస్టు నుంచి 12 జిల్లాల్లో వాటిని 30% కన్నా తగ్గించింది.

ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని 14 జిల్లాల్లో కార్డుల సంఖ్యను భారీగా పెంచింది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ జాబితా నుంచి తొలగించిన వారికి పీఎంజీకేఏవై ఆరో విడతకు సంబంధించి ఆగస్టు 1 నుంచి ఇచ్చే ఉచిత బియ్యం అందవు. కొత్తగా చేరిన వారికి ఉచిత బియ్యం ఇస్తారు. రాష్ట్ర కార్డుల నుంచి ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలోకి చేర్చిన వాటిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కార్డులే ఎక్కువగా ఉన్నాయి. పౌర సరఫరాలశాఖ తాజాగా విడుదల చేసిన ఆగస్టు రేషన్‌ పంపిణీ జాబితాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

* తాజాగా కాకినాడ జిల్లాలో 2.94 లక్షల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులను రాష్ట్ర కార్డుల పరిధిలోకి తీసుకువచ్చారు. వీటి పరిధిలోని 8.43 లక్షల మందికి ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం అందవు. విశాఖపట్టణం, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులు 1.60 లక్షల నుంచి 2.14 లక్షల్లోపు తగ్గాయి. కాకినాడ అర్బన్‌ మండలంలోని 37 దుకాణాల్లో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుల సంఖ్య సగటున 20 లోపే. ఇందులో ఎక్కువ దుకాణాల్లో రెండు, మూడు, నాలుగు కార్డులే. ఒక దుకాణంలో ఒక్క కార్డూ లేదు.

* పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో 235 కార్డులున్న ఓ దుకాణంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలో ఒక కార్డే మిగిలింది. ఇలాంటి పరిస్థితి చాలా దుకాణాల్లో ఉంది.

* మొత్తం కార్డుల్లో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులు కాకినాడ జిల్లాలో జులై వరకు 66% ఉండగా.. ఆగస్టు నుంచి 19 శాతానికే పరిమితం కానున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 62 నుంచి 22 శాతానికి, తూర్పుగోదావరిలో 60 నుంచి 24, విశాఖలో 54 నుంచి 21, నెల్లూరు జిల్లాలో 54 నుంచి 26 శాతానికి తగ్గించారు. కోనసీమ, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లోనూ మొత్తం కార్డుల్లో వీటి సంఖ్య 32% లోపే.

ఉత్తరాంధ్ర, సీమలో అధికంగా..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొత్తం కార్డుల్లో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులు జులై వరకు 35.17 శాతం ఉండగా 99 శాతానికి పెంచారు. విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోనూ 96%పైనే ఉన్నాయి. మిగిలిన ఉత్తరాంధ్ర, కొన్ని రాయలసీమ జిల్లాల్లోనూ 90% దాటాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 76%, తిరుపతి జిల్లాలో 61% చొప్పున ఉన్నాయి. తాజా మార్పులతో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులు ఒక్కసారిగా అనంతపురం జిల్లాలో 7.52 లక్షలు, కర్నూలు జిల్లాలో 7.29 లక్షల మంది పెరిగారు.
ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుల్లో భారీగా మార్పు చేర్పులపై పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును సంప్రదించగా.. పూర్తి వివరాలు సోమవారం విలేకరుల సమావేశంలోనే వెల్లడిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:ప్రైవేటు బడులకు పుస్తకాలెక్కడ?.. మార్కెట్‌లో దొరక్క తల్లిదండ్రుల అవస్థలు!

ABOUT THE AUTHOR

...view details