ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Curfew Relaxation: 50 శాతంతో వాటికి అనుమతి..అవి ఏంటంటే..! - ఏపీలో కర్ఫ్యూ సడలింపు

Changes in curfew relaxation in the state
రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

By

Published : Jul 5, 2021, 1:10 PM IST

Updated : Jul 5, 2021, 1:41 PM IST

13:05 July 05

ఆ రెండు జిల్లాలో తప్ప అన్ని జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాల మూసివేత

రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. సీట్ల మధ్య ఖాళీ ఉండేలా సినిమా థియేటర్లకు అనుమతినిచ్చింది. 50 శాతంతో రెస్టారెంట్లు, జిమ్‌లు, కల్యాణ మండపాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

 ఉభయ గోదావరి జిల్లాల్లో తప్ప.. అన్ని జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ రెండు జిల్లాలో  ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు సడలింపు చేయగా.. 6 గంటలకే దుకాణాల మూసివేయాలని ఆదేశించింది. మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపు ఉంటుందని...  రాత్రి 9 గంటలకే దుకాణాల మూసివేయాలని తెలిపింది. 

 వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పాజిటివిటీ రేటు 5 శాతంలోపు వచ్చే వరకు ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. ఈ సడలింపులు ఈనెల 8 నుంచి అమలు కానున్నాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.  

ఇదీ చూడండి.  High court: సోషల్ మీడియాలో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు విచారణ

Last Updated : Jul 5, 2021, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details