ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన వైమానిక దళం దేశానికి గర్వకారణం: చంద్రబాబు - వైమానికి దళానికి లోకేశ్ శుభాకాంక్షలు

మన వైమానిక దళం దేశానికే గర్వకారణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. భారత వైమానిక దళ 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

chandrababu
చంద్రబాబు

By

Published : Oct 8, 2020, 12:54 PM IST

భారత వైమానిక దళానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​లు 88వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ రఫెల్ యుద్ధవిమానాలు, స్వదేశీ తేజస్ విమానాలను అమ్ములపొదిలో చేర్చుకుని మరింత శక్తివంతంగా మారిన భారత వైమానిక దళం దేశానికి గర్వకారణమని చంద్రబాబు అన్నారు. ప్రాణాలకు తెగించి దేశానికి విజయాలను అందిస్తోన్న వైమానికదళ వీరులకు, వారి కుటుంబాలకు గౌరవాభివందనం తెలిపారు.

రెండో ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి నిన్నటి సర్జికల్‌ దాడుల వరకు భారతీయుల శక్తిని, ధైర్యసాహసాలను ప్రపంచానికి చాటిన వైమానిక దళానికి, వారి కుటుంబ సభ్యులకు దేశ ప్రజలందరూ రుణపడి ఉంటారని లోకేశ్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details