ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు పరిహారం అందేవరకు పోరాటం చేస్తా: చంద్రబాబు - penamaluru

కృష్ణాజిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. వరద ప్రాంతాలను పరిశీలించి.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

By

Published : Aug 20, 2019, 1:08 PM IST

Updated : Aug 20, 2019, 5:26 PM IST

కృష్ణాజిల్లా వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. గీతానగర్‌ వద్ద ముంపు ప్రాంతాలను తెదేపా అధినేత పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. కరకట్ట ప్రజల పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు

నీటి నిర్వహణ, వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు పేర్కొన్నారు. కనీసం మంచినీళ్లు కూడా సరాఫరా చేయడం లేదని ఆవేదన చెందారు.

వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

'కరకట్ట వెంట రక్షణ గోడను ప్రభుత్వం పూర్తి చేసి తీరాలి. అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. ప్రజల్ని తరలిస్తామని మంత్రులు అనడం లేదు. నా ఇల్లు ముంచటానికే ప్రయత్నిస్తున్నారు. ఇవి కృత్రిమ వరదలు.

సీఎం ఇంట్లో కూర్చొని డ్రోన్​ ప్రయోగం చేశారు. డ్రోన్​తో ఫొటోలే కాదు..బాంబులు పంపొచ్చు. మంత్రులంతా నా ఇంటి ఇంటి చుట్టే తిరిగారు తప్ప..ప్రజల్ని పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఇసుక దొరకదు, అన్న క్యాంటీన్​ తెరవరు'

-- చంద్రబాబు, తెదేపా అధినేత

పెనమలూరులో చంద్రబాబు పర్యటన

పెనమలూరులో..
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. యనమలకుదురు, పెదపులిపాక, కాసరనేనిపాలెంలో పర్యటించి నీట మునిగిన ఇళ్లు, పొలాలను పరిశీలించారు. పంటమునిగి తాము బాధపడుతుంటే, వర్షాలతో రైతులు ఆనందంగా ఉన్నారంటూ మంత్రులు ప్రకటించడం మరింత బాధించిందని అన్నదాతలు చంద్రబాబుకు గోడువెళ్లబోసుకున్నారు.

పామర్రులో...

పామర్రులో...
రైతులు తీవ్రంగా నష్టపోయారని, కౌలు రైతులు దిగాలు పడ్డారని చంద్రబాబు వాపోయారు. పామర్రు నియోజకవర్గంలోని వరద ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. నీట మునిగిన పంటపొలాలను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఇంతవరకు పంట నష్టం అంచనాకు రాకపోవటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పరిహారం అందేవరకు పోరాటం చేస్తామని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో కరవు ఉన్నా నీటి వినియోగంపై దృష్టి సారించలేదని... వరద వచ్చినా రాయలసీమలో చెరువులు, కాల్వలకు నీరు వదల్లేదన్నారు. ప్రాజెక్టులకు కూడా ముప్పు వాటిల్లేలా చూశారని... సక్రమంగా అధికారులకు వదిలిపెట్టినా ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదని చంద్రబాబు అన్నారు.

ఇదీ చదవండి

గోదావరికి మళ్లీ వరద సూచన: ఆర్టీజీఎస్

Last Updated : Aug 20, 2019, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details