నెల్లూరు ప్రభుత్వాస్పత్రి ఘటనలో ఇద్దరు నర్సులను సస్పెండ్ చేయడం పట్ల తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. సస్పెన్షన్ ఎల్లప్పుడూ సమస్యకు పరిష్కారం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం మద్ధతివ్వనప్పుడు, స్పందించనప్పుడు నర్సులు ఏమి చేయగలరని నిలదీశారు. కరోనా మహమ్మరిపై జరిగే పోరులో నర్సులు విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని చంద్రబాబు కొనియాడారు.
నర్సుల సస్పెన్షన్పై మండిపడ్డ చంద్రబాబునాయుడు - chandrababunaidu latest news
నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో రోగుల దుస్థితి బయటపడితే ఇద్దరు నర్సులను సస్పెండ్ చేయడం తగదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. సస్పెన్షన్ ఎల్లప్పుడూ సమస్యకు పరిష్కారం కాదని ఆయన అన్నారు.
నర్సుల సస్పెన్షన్ పై మండిపడ్డ చంద్రబాబు నాయుడు
అలాంటి వారిపై ముఖ్యమంత్రి జగన్ కఠిన నిర్ణయాలు తగవన్న చంద్రబాబు..క్షేత్రస్థాయిలో పనిచేసే వారి నైతికస్పూర్తిని దెబ్బతీసే చర్యలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. నర్సుల సస్పెన్షన్ కు నిరసనగా వైద్య సిబ్బంది నిరసన తెలిపిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
ఇదీ చదవండి: ఫేక్ బతుకులకు స్వస్తి పలకండి: నారా లోకేశ్