'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' ఉద్యమానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి......... పొట్టిశ్రీరాములు పోరాటం స్ఫూర్తిదాయకం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాక్షించారు. అరాచక శక్తుల విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోవడమే ఆ అమరజీవికి నిజమైన నివాళి అని ఆయన అభిప్రాయపడ్డారు. అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. నిస్వార్థ ఆశయాలు, నిష్కళంక చరిత్ర, సడలని కార్యదక్షతలతో గాంధీజీ మెప్పు పొందిన తెలుగు వెలుగు పొట్టి శ్రీరాములు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొనియాడారు. తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయనను తెలుగువారంతా మననం చేసుకుందామంటూ ట్వీట్ చేశారు.
'ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం' - మహానుభావుడు పొట్టి శ్రీరాములు
తెలుగువారంతా నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఆత్మత్యాగం దృఢసంకల్పానికి నిదర్శనమన్నారు.

chandrababu-tweets-on-polli-sriramulu
'ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం'
ఇవీ చదవండి:దేశవ్యాప్తంగా 'కరోనా' ఆంక్షలు.. అన్నీ బంద్