విజయనగరంలో చారిత్రక కట్టడం మూడు లాంతర్ల స్తంభాన్ని జగన్ ప్రభుత్వం పడగొట్టడం షాక్కు గురిచేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి అశోక్ గజపతి రాజు కుటుంబం చేసిన కృషిని చెరిపేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రల్లో ఇదొకటని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు చరిత్రలో ఎప్పుడూ పైచేయి సాధించలేదన్నారు. లాంతర్ స్తంభం కూల్చివేత వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
' రాజకీయ కుట్రలో భాగమే.. లాంతర్ స్తంభం కూల్చివేత'
విజయనగరంలో రాజుల కాలం నాటి చారిత్రక కట్టడం మూడు లాంతర్ల స్తంభాన్ని మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. ఇది మంచి పద్దతి కాదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
CHANDRABABU