CBN ON ROADS : ఇప్పటంలో కాదు ముందు జగనన్న కాలనీలకి వెళ్లే మార్గంలో రోడ్డు వేయండని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెంలోని జగనన్న కాలనీలో రోడ్ల దుస్థితిని తెలిపే వార్తను.. చంద్రబాబు ట్వీట్ చేశారు. జగనన్న కాలనీ లబ్ధిదారులకు రోడ్డు సౌకర్యం కల్పించకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు. చదును చేసేందుకు లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని చోట రహదారి అభివృద్ధిని విస్మరించటంపై మండిపడ్డారు. ట్రాక్టర్ కూడా వెళ్లలేని దారుణ రోడ్డు పరిస్థితిని ముందు మార్చండి అంటూ..ప్రభుత్వానికి చురకలు అంటించారు.
ఇప్పటంలో కాదు.. అక్కడ రోడ్లు వేయండి: చంద్రబాబు - ఇప్పటం
CBN TWEET ON ROADS : ఇప్పటంలో కాదు.. ముందు జగనన్న కాలనీలకి వెళ్లే మార్గంలో రోడ్డు వేయండని తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ప్రభుత్వానికి హితవు పలికారు.
CBN ON ROADS