వైకాపా నేతలకు వ్యక్తిత్వం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వారంతా కట్టుబానిసలని ఘాటుగా విమర్శించారు. శుక్రవారం ఆన్లైన్లో మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. వైకాపా నేతలు ఏ ఎండకు ఆ గొడుగు పడతారని ఆయన మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి మొదలు ఆ పార్టీ నేతలు అప్పట్లో చెప్పిన మాటలకు ఇప్పటి మాటలకు పొంతన లేదని ఎద్దేవా చేశారు. వైకాపా నేతలు మాట్లాడిన వీడియోలను చంద్రబాబు ప్రదర్శించారు.
వైకాపా నేతలు ఏ ఎండకు ఆ గొడుగు పడతారు: చంద్రబాబు - వైకాపాపై చంద్రబాబు విమర్శలు
వైకాపా నేతలను తమ మాటలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. వారంతా ఏ ఎండకు ఆ గొడుగు పడతారని దుయ్యబట్టారు.
Chandrababu