ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గౌతు లచ్చన్న నిస్వార్థ సేవ అందరికీ ఆదర్శం: చంద్రబాబు - goutu lachanna

సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, రైతు సంక్షేమానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సాహసానికి, కార్యదక్షతకు మరోపేరు గౌతు లచ్చన్నని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.

chandrababu
చంద్రబాబు

By

Published : Apr 19, 2021, 12:32 PM IST

అణగారిన వర్గాల అభ్యున్నతికి, రైతు సంక్షేమానికి సర్దార్ గౌతు లచ్చన్న ఎంతో కృషి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. తెలుగువారి సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన లచ్చన్న నిస్వార్థ ప్రజాసేవ నేటి తరాలకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.

సాహసానికి, కార్యదక్షతకు మరోపేరు గౌతు లచ్చన్నని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గుర్తు చేశారు. స్వాతంత్రోద్యమ పోరాట వీరునిగా, హరిజన సేవకుడిగా, రైతు పక్షపాతిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details