స్త్రీ విద్య కోసం కోటేశ్వరమ్మ అసమాన కృషి: చంద్రబాబు - chandrababu
సూర్యారావుపేటలో కోటేశ్వరమ్మ స్వగృహానికి చంద్రబాబు వెళ్లారు. ఇటీవలే దివంగతులైన ఆమెకు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
![స్త్రీ విద్య కోసం కోటేశ్వరమ్మ అసమాన కృషి: చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3778569-thumbnail-3x2-babu.jpg)
babu
స్త్రీ విద్య కోసం కోటేశ్వరమ్మ అసమాన కృషి చేశారు:చంద్రబాబు
విద్యావేత్తగా, సేవామూర్తిగా మాంటిస్సోరి కోటేశ్వరమ్మ జీవితం.. భావితరాలకు ఆదర్శమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలోని సూర్యారావుపేటలో కోటేశ్వరమ్మ స్వగృహానికి విచ్చేసిన బాబు... కోటేశ్వరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మహిళా సాధికారత, స్త్రీ విద్య కోసం కోటేశ్వరమ్మ అసమాన కృషి చేశారని కొనియాడారు.