25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవికి తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. క్షణ క్షణం ఆనంద వీక్షణం అంటూ... సంస్కృతి, సాహిత్యం, కళలకు పట్టం కడుతూ, పాత్రికేయ విలువలను కాపాడుతూ, అన్నదాతలకు అండగా ఈటీవి నిలుస్తోందన్నారు. ఎంతో మందికి ఉపాధిని అందిస్తూ.. వినూత్న కార్యక్రమాలతో 25ఏళ్లుగా తెలుగులోగిళ్లకు ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తోన్న ఈటీవీకి రజతోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈటీవీ రజతోత్సవం.. చంద్రబాబు శుభాకాంక్షలు - తెదేపా అధినేత చంద్రబాబు వార్తలు
ఈటీవి రజతోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. వినూత్న కార్యక్రమాలతో 25ఏళ్లుగా తెలుగులోగిళ్లకు... ఈటీవీ ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తోందన్నారు.
![ఈటీవీ రజతోత్సవం.. చంద్రబాబు శుభాకాంక్షలు chandrababu naidu wishes to etv on celebration of silver jubilee year](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8573586-362-8573586-1598504809885.jpg)
ఈటీవీ రజతోత్సవం సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు
ఇదీ చదవండి: