ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమవారం రాష్ట్రానికి చంద్రబాబునాయుడు! - Chandrababu Naidu latest news

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్​ నుంచి విశాఖకు వెళ్లేందుకు అనుమతించాలని.. డీజీపీ గౌతమ్ సవాంగ్​కు లేఖ రాయగా.. ఇంకా అనుమతి రావాల్సి ఉంది.

Chandrababu Naidu to come to the state on Monday
సోమవారం రాష్ట్రానికి రానున్న చంద్రబాబునాయుడు

By

Published : May 23, 2020, 9:28 PM IST

Updated : May 23, 2020, 10:09 PM IST

లాక్​డౌన్ కారణంగా రెండు నెలలుగా హైదరాబాద్​లో ఉన్న చంద్రబాబు నాయుడు సోమవారం రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నారు. స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజీ బాధితులను పరామర్శించేందుకు అనుమతి కోరారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించగా.. ఏపీ డీజీపీ నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది.

డీజీపీకి చంద్రబాబు లేఖ

ఇదీ చూడండి:తమిళనాడులోని స్వామివారి స్థిరాస్తుల విక్రయానికి తితిదే నిర్ణయం

Last Updated : May 23, 2020, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details