తెదేపా అధినేత చంద్రబాబు రేపటి నుంచి పురపాలక ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. నగరపంచాయతీలతో పాటు వివిధ మున్సిపాలిటీలల్లోను ఆయన ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధంచేసుకున్నారు. తొలిరోజు చిత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న చంద్రబాబు,అక్కడ గాంధీ విగ్రహాం వద్ద వైకాపా అక్రమాలకు పాల్పడుతుందంటూ ఆందోళన చేపట్టనున్నారు. ఎన్నికలు జరిగే మొత్తం 12 కార్పొరేషన్లలో చంద్రబాబు ప్రచారం చేసేలా కార్యాచరణ సిద్దమవుతుంది.
రేపటి నుంచి చంద్రబాబు పురపాలక ఎన్నికల ప్రచారం - Municipal Election campaign latest updates
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఇతర ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికలు జరిగే మొత్తం 12 కార్పొరేషన్లలో చంద్రబాబు ప్రచారం చేసేలా కార్యచరణ సిద్దమవుతుంది.
పట్టణ ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే 10అంశాలతో కూడిన హామీలను తప్పక అమలుచేసి తీరతామoటూ మేనిఫెస్టోను తెదేపా ఇటివలే విడుదల చేసింది. అన్నక్యాంటీన్లు-5 రూపాయలకే భోజనం, పాత పన్ను మాఫీ-ఇకపై సగం పన్నే వసూలు, శుభ్రమైన ఊరు-శుద్ధమైన నీరు, నిరుద్యోగులకు 6 నెలలకొకసారి జాబ్ మేళా, సుందరీకరణ మిషన్-చెత్త లేని నగరం ఏర్పాటు, ఆటో డ్రైవర్లకు అన్ని సౌకర్యాలతో ఆటోస్టాండులు ఏర్పాటు, మెప్మా బజార్-మెప్మాలు బలోపేతం-సున్నా వడ్డీకి బ్యాంకు లింకేజీ, పారిశుద్ధ్య కార్మికులకు 21వేల వేతనం, పట్టణ పేదలకు గృహనిర్మాణం-ఉచిత మంచినీటి కనెక్షన్ వంటి అంశాలను మేనిపెస్టోలో చేర్చారు. వీటనంటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలా చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఇతర ముఖ్యనేతలు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రోడ్ షోల ద్వారా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలు చుట్టేలా ప్రచార ప్రణాళికను వీరు సిద్దం చేసుకుంటున్నారు.
ఇవీ చదవండి
'వైకాపా ప్రభుత్వ చర్యలతో పోలవరం నిర్మాణంపై నీలినీడలు'