విజయవాడ ఎన్కేపాడులోని అను ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొప్పన రాఘవేంద్రరావుని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని రాఘవేంద్రరావుకి సూచించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కొన్ని రోజులుగా రాఘవేంద్రరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీఆర్ తో రాఘవేంద్రరావు ఎంతో సన్నిహితంగా మెలిగేవారని పార్టీ వర్గాలు తెలిపాయి.
CHANDRABABU : తెదేపా నేత రాఘవేంద్రరావుకు చంద్రబాబు పరామర్శ - TDP leader raghavendrarao
తెదేపా సీనియర్ నేత బొప్పన రాఘవేంద్రరావును తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. రాఘవేంద్రరావు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ... విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఆయనను పరామర్శించి, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
రాఘవేంద్రరావుకు చంద్రబాబు పరామర్శ
Last Updated : Aug 14, 2021, 3:18 AM IST