ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాగంటి రాంజీ మృతికి సంతాపం తెలిపిన చంద్రబాబు - achennaidu latest news

కృష్ణాజిల్లా మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతికి తెదేపా నేతలు సంతాపం తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్​, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు.

TDP leaders mourn Ranji's death
రాంజీ మృతికి సంతాపం తెలిపిన తెదేపా నేతలు

By

Published : Mar 8, 2021, 10:44 AM IST

కృష్ణాజిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ మరణం బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ పటిష్టతకు ముందుండి కృషి చేసిన రాంజీ మృతి, తీరని లోటని లోకేశ్​ అన్నారు. రాంజీ మరణం జీర్ణించుకోలేని విషయమన్న అచ్చెన్న.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తునన్నారు.

ABOUT THE AUTHOR

...view details