ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రాణహాని' - డీజీపీ గౌతమ్​ సవాంగ్​

అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రాణహానీ ఉందని డీజీపీ గౌతమ్​ సవాంగ్​కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్​ను అడ్డుకుంటూ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆయనకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు.

CBN
చంద్రబాబు

By

Published : Jul 30, 2021, 9:33 PM IST

అక్రమ మైనింగ్​పై పోరాడుతున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రాణహానీ ఉందని డీజీపీ గౌతమ్​ సవాంగ్​కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రజా జీవితంలో క్రియాశీలకంగా ఉన్న రామకృష్ణారెడ్డి అక్రమ మైనింగ్​ను అడ్డుకుంటూ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

రామకృష్ణారెడ్డి, అతని కుటుంబ సభ్యుల్నీ చంపేసి ఆస్తులు ధ్వంసం చేస్తామంటూ మైనింగ్ మాఫియా బెదిరిస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై అనేకమార్లు ఫిర్యాదు చేసి తనకు రక్షణ కల్పించాలని రామకృష్ణారెడ్డి.. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీని కోరినా ఇంతవరకూ ఎలాంటి చర్యలూ లేవని లేఖలో తెలిపారు. వెంటనే రామకృష్ణారెడ్డి, అతని కుటుంబసభ్యులకు తగిన రక్షణ కల్పించాలని చంద్రబాబు కోరారు.

ఇదీ చదవండి:Govt Employees: 'ఏపీ రాష్ట్ర పరిపాలన సర్వీసును అమల్లోకి తీసుకురావాలి'

ABOUT THE AUTHOR

...view details