చంద్రబాబు అమరావతి నుంచి దిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు. చంద్రగిరి రీపోలింగ్, ఇతర అంశాలపై ఈసీ అధికారుల ముందు నిరసన తెలియజేయనున్నారు. ఈసీ తీరుకు నిరసనగా కేంద్ర ఎన్నికల సంఘానికి నిన్న చంద్రబాబు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు. విపక్ష పార్టీల సమావేశానికి ఏయే పార్టీలకు ఆహ్వానాలు పంపాలనే అంశంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో చంద్రబాబు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శరద్ పవార్, శరద్ యాదవ్, కేజ్రీవాల్, సీతారాం ఏచూరి వంటి జాతీయ నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. దిల్లీ నుంచి లఖ్‌నవూ వెళ్లి మాయావతితో భేటీ కానున్నారు.
దిల్లీకి చంద్రబాబు.. ఈసీ నిర్ణయాలపై నిరసన
ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో చంద్రగిరి రీపోలింగ్, ఇతర అంశాలపై ఈసీ అధికారుల ముందు సీఎం నిరసన తెలియజేయనున్నారు.
చంద్రబాబు