ఇసుక కొరతపై ఈ నెల 14న చంద్రబాబు దీక్ష - chandrababu deeksha latest news
రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతపై తెదేపా అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. ఈ నెల 14న విజయవాడలో ఆయన ఒక రోజు దీక్ష చేయనున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ దీక్ష కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇసుక కొరతపై ఇప్పటికే రెండుసార్లు తెదేపా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేసింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విశాఖలో చేపట్టిన లాంగ్‌మార్చ్‌కి సైతం మద్దతు తెలిపింది.
cbn
ఇసుక కొరత తీర్చడం చేతగాని అసమర్థ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా..ఈ నెల14న దీక్ష చేయనున్నట్లు....తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారు.ఉదయం8గంటల నుంచి రాత్రి8గంటల వరకు దీక్ష కొనసాగుతుందన్నారు.భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై మంత్రులు అహంభావంతో మాట్లాడుతున్నారన్న చంద్రబాబు....ఇప్పటికైనా ఆ పద్ధతిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Last Updated : Nov 6, 2019, 8:03 AM IST