వ్యవసాయదారుల మాసపత్రిక అన్నదాత మాజీ సంపాదకులు వాసిరెడ్డి నారాయణరావు మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. మూడు దశాబ్దాల పాటు పత్రికా సంపాదకులుగా వాసిరెడ్డి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రైతుల సేవకే తన జీవితాన్ని అంకితం చేశారని కీర్తించారు. రైతాంగ అభ్యున్నతే లక్ష్యంగా వందలాది వ్యాసాలు రచించడమే కాకుండా.. పశు సంవర్దక రంగం అభివృద్దికి పాటుబడ్డారని చంద్రబాబు గుర్తుచేశారు. వాసిరెడ్డి నారాయణరావు మృతి రాష్ట్ర రైతాంగానికి తీరనిలోటని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని రైతులు, రైతుకూలీలు ఆర్ధికంగా బలోపేతం కావడమే వాసిరెడ్డి నారాయణ రావుకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
వాసిరెడ్డి నారాయణరావు మృతిపట్ల చంద్రబాబు సంతాపం - వాసిరెడ్డి నారాయణరావు మృతి
అన్నదాత మాజీ సంపాదకులు వాసిరెడ్డి నారాయణరావు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు.
chandrababu Condolence