తెదేపా నాయకుల మరణాలు దిగ్భ్రాంతికి గురి చేశాయని తెదేపా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. కరోనా బారిన పడి తెలుగుదేశం నాయకులు, సానుభూతిపరులు వరుసగా మృతి చెందడం విచారకరమన్నారు. సంగం డైయిరీ డైరెక్టర్ పోపూరి కృష్ణారావు మృతి కలచివేసిందని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల ఆయన స్పందించే తీరు అందరికి ఆదర్శనీయమన్న చంద్రబాబు.. అందరినీ ఆప్యాయంగా పలకరించి.. చేతనైన సాయం చేసే వ్యక్తి మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. వారి కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెదేపా తెనాలి పట్టణ ప్రధాన కార్యదర్శి వసంతం అశోకవర్ధన్ సతీమణి శివకామేశ్వరి స్వర్గస్తులు అవ్వటం చాలా బాధాకరమని.. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెదేపా నాయకుల మరణాలపై చంద్రబాబు దిగ్భ్రాంతి - ఏపీలో కరోనా కేసులు
కరోనా మహమ్మారితో తెదేపా నాయకులు, సానుభూతిపరులు వరుసగా మృతి చెందడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందరినీ ఆప్యాయంగా పలుకరించి చేతనైన సాయం చేసే వ్యక్తి సంగం డైయిరీ డైరెక్టర్ పోపూరి కృష్ణారావు మృతిపై ప్రగాఢ సానుభూతి తెలిపారు.
chandrababu