చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం.. ఆర్సీపురం మండలం పూజగారిపల్లె మాజీ సర్పంచ్ సుబ్రమణ్యం యాదవ్పై తప్పుడు కేసులు పెట్టారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ నెల 12న సుబ్రమణ్యం యాదవ్పై వైకాపా నాయకులు దాడి చేస్తే.. కేసు పెట్టేందుకు స్టేషన్ కు వెళ్లిన యాదవ్ పై పోలీసుల ఎదుటే మళ్లీ దాడికి ప్రయత్నించారని మండిపడ్డారు. అలాంటిది సుబ్రమణ్యం యాదవ్ ఫిర్యాదు స్వీకరించకుండా తిరిగి ఆయనపైనే వాలంటీర్లతో ఎదురు కేసు పెట్టించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితులపైనే కేసులు బనాయించడం హేయం: చంద్రబాబు - మాజీ సర్పంచ్ సుబ్రమణ్యం యాదవ్ పై వైకాపా నేతల దాడి
చంద్రగిరి నియోజకవర్గం పూజగారిపల్లె మాజీ సర్పంచ్ సుబ్రమణ్యం యాదవ్పై వైకాపా నేతల దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టేందుకు వెళ్లిన సుబ్రమణ్యం యాదవ్ పై కేసు నమోదు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు.
సుబ్రమణ్యం యాదవ్ కొడుకునూ ఈ కేసులో ఇరికించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. తప్పు చేసినవాళ్లపై చర్యలు తీసుకోకుండా.. బాధితులపైనే కేసులు బనాయించడం హేయంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. బీసీ నాయకులపై వైకాపా చేస్తున్న దాడులను చంద్రబాబు ఖండించారు. దాడి గురించి తెలిసిన వెంటనే చంద్రబాబు సుబ్రమణ్యం యాదవ్ కు ఫోన్ చేసి పరామర్శించారు. వైకాపా దురాగతాలను ఖండించిన ఆయనకు.. పార్టీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ..