ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువశక్తిని నిర్వీర్యం చేసే పనులను ఇకనైనా ఆపండి: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు

తెదేపా అధికారంలో ఉన్నప్పుడు యువత కోసం తెచ్చిన పథకాలన్నీ ప్రస్తుత వైకాపా ప్రభుత్వం నిలిపివేయడం బాధాకరమని పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ‘యువనేస్తం’ కింద ఇచ్చే నిరుద్యోగ భృతిని రద్దు చేశారని మండిపడ్డారు. 2,063 కోట్ల రూపాయల నుంచి 604 కోట్ల రూపాయలకు బడ్జెట్ తగ్గించడం బాధాకరమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

chandrababu
chandrababu

By

Published : Jul 15, 2020, 5:55 PM IST

ప్రభుత్వ ఉగ్రవాదం అనే మచ్చ రాష్ట్రానికి తెచ్చి ఏడాదిలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పోగొట్టారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహించారు. వాటాల కోసం బెదిరించి పారిశ్రామికవేత్తలను తరిమేశారని మండిపడ్డారు. తెలుగుదేశం తెరపైకి తెచ్చిన ‘విదేశీ విద్య, ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేడ్కర్ ఓవర్ సీస్ విద్యానిధి' లాంటి పథకాలన్నీ 14 నెలలుగా నిలిపేయడం బాధాకరమన్నారు.‘యువనేస్తం’ కింద ఇచ్చే నిరుద్యోగ భృతిని రద్దు చేశారని మండిపడ్డారు. కార్పోరేషన్లను నిర్వీర్యం చేసి స్వయం ఉపాధికి గండికొట్టారన్న చంద్రబాబు.. యువజన సంక్షేమం బడ్జెట్ లో ఏకంగా 70 శాతం కోత పెట్టారని ధ్వజమెత్తారు.

2,063 కోట్ల రూపాయల నుంచి 604 కోట్ల రూపాయలకు బడ్జెట్ తగ్గించడం బాధాకరమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువశక్తిని నిర్వీర్యం చేసే పనులకు ఇకనైనా వైకాపా ప్రభుత్వం స్వస్తి చెప్పి.. యువత నైపుణ్యాల అభివృద్దిపై దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా యువతకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో 3 సమ్మిట్ల ద్వారా 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 30 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఎంవోయూలు చేశారని గుర్తు చేశారు. పెట్టుబడుల గమ్యస్థానంగాను.. ఉపాధి కేంద్రంగా ఏపీని రూపొందిస్తే.. వైకాపా అధికారంలోకి వచ్చాక అంతా నాశనం చేశారని ఆవేదన చెందారు.

ABOUT THE AUTHOR

...view details