తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామానికి చెందిన సాంబత్తుల భాగ్యలక్ష్మి తెదేపా తరపున ఎంపీటీసీగా నామినేషన్ వేయడానికి వెళ్తున్న సమయంలో వైకాపా నేతలు అడ్డుకుని బెదిరించారని తెదేపా అధినేత చంద్రబాబు గుర్తుచేశారు. దళితులని ప్రభుత్వం ఎందుకిలా అణచివేస్తోందని మండిపడ్డారు. తెదేపా తరపున నామినేషన్ వేసినందుకు ఉపాధిహామీ సభ్యురాలిగా ఉన్న భాగ్యలక్ష్మిని పనిలోకి రావద్దని చెప్పడం ఏంటని నిలదీశారు. ఇదేంటని అడిగితే కులం పేరుతో దూషిస్తారా అంటూ ద్వజమెత్తారు. ప్రభుత్వం భాగ్యలక్ష్మిని వెంటనే పనుల్లోకి తీసుకోవాలని.. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
'ఆ దళిత మహిళపై వైకాపా నాయకులకు ఎందుకంత కక్ష' - చంద్రబాబు తాజా వార్తలు
తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీటీసీగా నామినేషన్ వేసిన సాంబత్తుల భాగ్యలక్ష్మి అనే దళిత మహిళపై వైకాపా నాయకులు కక్ష గట్టి తన జీవనోపాధిని దెబ్బతీసారని చంద్రబాబు ఆరోపించారు. వెంటనే ఆమెను విధుల్లోకి అనుమతించాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.
chandrababu